ఇంటర్వ్యూ : మహేష్ సూరపనేని – రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్ లేదు !

ఇంటర్వ్యూ : మహేష్ సూరపనేని – రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్ లేదు !

Published on Sep 13, 2017 11:23 AM IST


నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘కథలో రాజకుమారి’. టీజర్, ట్రైలర్లతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేష్ సూరపనేని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) డైరెక్షన్ గా మొదటి సినిమా కదా రిలీజ్ టెంక్షన్ ఏమైనా ఉందా ?
జ) రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్ లేదు. ఎందుకంటే ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. రిజల్ట్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రేక్షకులకి చిత్రం తప్పక నచ్చుతుంది.

ప్ర) మీ నైపథ్యం ఏంటి ?
జ) నాది విజయవాడ. అక్కడే ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత యూఎస్లో ఎం.ఎస్ చేసి ఇండియా వచ్చి సినిమా ఫీల్డ్ లోకి ఎంటరయ్యాను. మొదటి తేజగారి ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకు పనిచేసి ఆ తర్వాత కోన వెంకట్, పరుచూరి గార్ల దగ్గర, అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ లో పనిచేశాను.

ప్ర) నారా రోహిత్ నెగెటివ్ రోల్ గురించి చెప్పండి ?
జ) ఇందులో ఆయనే విలన్. అతని స్వభావం పూర్తిగా నెగెటివ్ గా ఉంటుంది. సినిమా మొత్తం దాదాపు విలన్ గానే కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఆయన్ను ఆడియన్స్ నెగెటివ్ రోల్ లో చూడలేదు కాబట్టి వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది.

ప్ర) మరి నాగ శౌర్య ?
జ) నాగ శౌర్య గెస్ట్ రోల్ చేశారు. ఒక 25 నిముషాల పాట్లు కనిపిస్తారంతే. అంటే కథ కాసేపు సినిమా బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. ఆ భాగంలో నాగ శౌర్య ఉంటాడు.

ప్ర) అసలు కథ ఏంటి ?
జ) నెగెటివ్ మెంటాలిటీతో ఉండే నారా రోహిత్ జీవితంలోకి అమ్మాయి ఎలా వచ్చింది, ఆమె అతనికి రాజకుమారి ఎలా అయింది, ఆమె కోసం ప్రతినాయకుడిలా ఉన్న కనిపించే రోహిత్ మంచివాడిలా ఎలా మారాడు అనేదే కథ.

ప్ర) ఈ థాట్ మీకెలా వచ్చింది ?
జ) స్క్రీన్ మీద ఎప్పుడూ నెగెటివ్ గా కనిపించే నటులు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఎంత మంచిగా ప్రవర్తిస్తారు అనే ఆలోచన నుండి ఈ కథ పుట్టింది.

ప్ర) సినిమా ఎందుకింత ఆలస్యమైంది ?
జ) ముందుగా ఆగష్టు 25న రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ అప్పుడు థియేటర్స్ దొరక్క ఆగిపోయాం. అందుకే సెప్టెంబర్ 15 అయితే అన్నింటికీ బాగుంటుందని ఫిక్స్ చేశాం.

ప్ర) సినిమాను చూసిన వాళ్ళు ఏమన్నారు ?
జ) నా సన్నిహితుల్లో కొందరికి మాత్రమే సినిమా చూపించాను. చూసిన వాళ్లంతా బాగుంది, కొత్త ప్రయత్నం అన్నారు. ప్రేక్షకులు కూడా అదే అనుకుంటారని ఆశిస్తున్నాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) టీజర్, ట్రైలర్ చూసి కొందరు ఫోన్ చేశారు. కొన్ని డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా రిజల్ట్ ను బట్టే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు