దర్శకురాలిగా నా సోదరి అరంగేట్రం చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది – కీర్తి సురేష్

Published on May 25, 2023 11:10 pm IST

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ నటి గా ఫస్ట్ మూవీ నుండి మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు కీర్తి సురేష్. ఇటీవల నానితో కలిసి నటించిన దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా ఆమె సోదరి రేవతి సురేష్ దర్శకురాలిగా సినీ పరిశ్రమకు అరంగేట్రం చేస్తున్నారు.

తన సోదరి దర్శకత్వం వహిస్తున్న థాంక్యూ షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ పోస్టర్ ని కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొద్దిసేపటి క్రితం షేర్ చేసారు. ఈ స్వీట్ షార్ట్ ఫిల్మ్ థ్యాంక్యూ కి నా సోదరి దర్శకురాలిగా ఎట్టకేలకు అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. రేవతి నీకు చాలా లవ్ మరియు హగ్స్ పంపుతున్నాను అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేష్ కుమార్, నితిన్ మోహన్ లు నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :