నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను – జాన్వీ కపూర్

Published on Mar 25, 2023 1:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయనున్న లేటెస్ట్ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఇటీవల వైభవంగా లాంచింగ్ జరుపుకున్న ఈ మూవీ ఏప్రిల్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ నేడు ఒక ఈవెంట్ లో భాగంగా ఈ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న ఈ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక ఈసినిమా అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవని, ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షూటింగ్ అతి త్వరలో మొదలు కానుండడంతో తన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకున్నాను అన్నారు. కొరటాల శివ అద్భుతమైన స్టోరీ చెప్పారని, తప్పకుండా ఈ పాన్ ఇండియన్ మూవీ హీరోయిన్ గా తనకు పెద్ద బ్రేక్ ని అందిస్తుందని ఆశాభావం ఆమె వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :