ఇంటర్వ్యూ: మెహ్రీన్ కౌర్ – రిలీజ్ పట్ల నాకు ఎలాంటి టెంక్షన్ లేదు !


‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ తో నటిగా పరిచయమైన మెహ్రీన్ కౌర్ చేసిన తాజా చిత్రం ‘మహానుభావుడు’. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానున్న సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘మహానుభావుడు’ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇదొక స్వీట్ లవ్ స్టోరీ. హీరో అతి శుభ్రత అనే లక్షణంతో ఉంటాడు. దాని వలన అతని జీవితం ఏమైంది అనేదే సినిమా. ప్రతి ఒక్కరిలోనూ శుభ్రత ఉంటుంది. అది ఒక లెవెల్ కు మించి ఉంటే ఎలా ఉంటుంది అనేదే సినిమా కాన్సెప్ట్.

ప్ర) ‘మహానుభావుడు’ లో మీ పాత్ర గురించి చెప్పండి ?
జ) నా పాత్ర పేరు మేఘన. విలేజ్ నుండి వచ్చి ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. క్యారెక్టర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా మొదటి సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ లోని మహాలక్ష్మికి ఈ సినిమాలో మేఘనకి చాలా తేడా ఉంటుంది.

ప్ర) మారుతిగారిటి వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) మారుతిగారు స్క్రిప్ట్ చెప్పగానే చాలా ఎగ్జైట్ ఫీలయ్యాను. వెంటనే ఒప్పేసుకున్నాను. ఆయనలాంటి డైరెక్టర్ ట్ యూవీ క్రియేషన్స్ లాంటి గొప్ప బ్యానర్లో వర్క్ చేయడం చాల సంతోషంగా ఉంది.

ప్ర) అతి శుభ్రత కాకుండా ఇందులో వేరే అంశాలు ఏముంటాయి ?
జ) ఓసీడీ కాకుండా ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. మా ఇద్దరి మధ్య మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీరు సినిమాలో చూడాల్సిందే.

ప్ర) ‘భలే భలే మగాడివోయ్’ కి దీనికి తేడా ఏంటి ?
జ) రెండూ వేరు వేరు సినిమాలు. చాలా తేడా ఉంటుంది. రెండూ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కాబట్టి ఒకటేలా ఉంటాయని అనుకుంటున్నారు. మొదటి 10 నిముషాలు సినిమా చూశాక రెండూ వేరు వేరని అర్థమైపోతుంది.

ప్ర) తెలుగులో రెండవ సినిమా చేయడానికి ఎందుకింత టైమ్ పట్టింది ?
జ) అది అనుకోకుండా జరిగిపోయింది. జరగడం కూడా మంచిదే అయింది. ఇప్పుడు నా టైమ్ మొదలైంది. ఒకటిన్నర సంవత్సరం తర్వాత నావి వరుస సినిమాలు రిలీజవుతున్నాయి. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను.

ప్ర) కొన్ని ప్రాజెక్ట్ నుండి మీరే తప్పుకున్నారని వార్తలొచ్చాయి ?
జ) నేను ఏ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోలేదు. అవి వర్కవుట్ కాలేదంతే. అవి నేను చేయవలసిన ప్రాజెక్ట్స్ కాదు కాబట్టే నా నుండి వెళ్లిపోయాయని అనుకుంటున్నాను. అయినా ఇప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నా సినిమాలు వెంట వెంటనే వచ్చినా ఎప్పటికప్పుడు కొత్త మెహ్రీన్ నే చూస్తారు.

ప్ర) శర్వానంద్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) శర్వానంద్ చాలా మంచివాడు. ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటాడు. పెద్దగా టెంక్షన్ పడడు. ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటాడు. అతనితో వర్క్ చాలా హాయిగా అనిపించింది. మేమిద్దరం త్వరగానే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.

ప్ర) ‘రాజా ది గ్రేట్’ చేస్తున్నారు కదా రవితేజ గురుంచి చెప్పండి ?
జ) రవితేజగారు చాలా కష్టపడి పైకొచ్చినవారు. ఇప్పటికీ అలానే కష్టపడి వర్క్ చేస్తారు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా నార్మల్ గా ఉంటారు. ఆయనకు రీస్టార్ట్ బటన్ ఉంటుంది. ప్రతి సినిమాకీ రీచార్జ్ అవుతూ, కొత్త నటుడిలా కనిపిస్తుంటారు. ‘రాజా ది గ్రేట్’ ఆయనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది.

ప్ర) రిలీజ్ పట్ల టెంక్షన్ ఏమైనా ఉందా ?
జ) ఎలాంటి టెంక్షన్ లేదు. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ప్రతి సినిమాని నా మొదటి సినిమా అనుకునే చేస్తాను. ఇంకో 50 సినిమాలు చేసినా నాకు కొత్తగానే ఉంటుంది.