అభిమానులు మాత్రమే సినిమా చూస్తే సరిపోదన్న వరుణ్ తేజ్ !
Published on Apr 12, 2017 9:30 am IST


మెగా హీరో వరుణ్ తేజ్ నూతన చిత్రం ‘మిస్టర్’ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా వరుణ్ ఇదివరకెన్నడూ లేని విధంగా పలు ఆసక్తికరమైన అంశాలను, మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాల్లో అభిమానులకు, ప్రేక్షకులకు సంబందించిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రేక్షకుల కోసం ఏం చేశారు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ సినిమాలు కేవలం అభిమానులు మాత్రమే చూస్తే సరిపోదు. అందరూ చూడాలి అన్నారు.

అభిమానులు హీరోలకు ఒక మంచి సపోర్ట్. వాళ్ళతో పాటే మిగిలిన వాళ్ళు కూడా థియేటర్ కి వస్తేనే సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ఒక సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఫ్యాన్స్ తో పాటే మిగతా ఆడియన్స్ కూడా సినిమా చూస్తేనే సాధ్యమైంది. సినిమా బాగుంటే అందరు హీరోల అభిమానులు ఆ సినిమాను చూస్తారు. ముఖ్యంగా సినిమా అనేది సాధారణ ప్రేక్షకులకి నచ్చాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది అన్నారు.

 
Like us on Facebook