ఇంటర్వ్యూ : రష్మీ గౌతమ్ – నా మీద వస్తున్న కామెంట్స్ పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు !

23rd, October 2017 - 02:53:33 PM


‘గుంటూరు టాకీస్’ చిత్రంతో మాస్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న నటి రష్మీ గౌతమ్. ప్రస్తుతం ఈమె హీరో ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె రష్మీ గౌతమ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఈ సినిమాలో నా పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువ చీరల్లో కనిపిస్తాను. నా లుక్ చాలా బాగుంటుంది.

ప్ర) బుల్లితెర మీద బాగా సక్సెస్ అయ్యారు.. బిగ్ స్క్రీన్ సంగతేంటి ?
జ) బుల్లితెర మీద తెలుగు సరిగా రాని నన్ను ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేశారు. అందుకు నా థ్యాంక్స్. బిగ్ స్క్రీన్ మీద కూడా అలాంటి ఆదరణే చూపిస్తే సంతోషిస్తాను. ఏదైనా చేసిన సినిమా రిలీజల్టును బట్టే ఉంటుంది.

ప్ర) కథలో మీరు ఎంత కీలకంగా ఉంటారు ?
జ) సినిమాలో నేను బ్రహ్మాజీ సోదరి పాత్ర చేశాను. మంచి సిట్యువేషనల్ కామెడీలో కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు కూడా రష్మీనే. ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి ఫస్ట్, సెకండ్ హీరోయిన్ అంటూ ఉండరు.

ప్ర) రష్మీ అంటే సెక్స్ అప్పీల్ ఎక్కువ అంటారు. ఆ కామెంట్ పట్ల మీ ఫీలింగ్ ?
జ) నాకెలాంటి అభ్యంతరం లేదు. నేనైతే కావాలని అలాంటి గుర్తింపు కోసం నటించలేదు. నాకు హిందీలో కూడా లాంగ్ కెరీర్ ఉంది. నాకు ఇలాంటి పాత్రలు వచ్చాయి కాబట్టే చేశాను, వాటిలో సక్సెస్ అయ్యాను. అయినా కొన్నేళ్ల తర్వాత గ్లామర్ ని చుపిస్తామన్నా ఎవరూ చూడరు.

ప్ర) ఒకప్పటి సిల్క్ స్మిత, జ్యోతి లక్ష్మిలాగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా ?
జ) ఖచ్చితంగా. జస్టిఫికేషన్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను. పాత్ర కథకి, పరిస్థితులకి తగ్గట్టు ఉంటే చేస్తాను.

ప్ర) ఇంత పాపులర్ అయ్యారు కదా పెద్ద హీరోల పక్కన అవకాశాలు ఎందుకు రావాట్లేదు ?
జ) ఏమో నాక్కూడా తెలీదు. నేనైతే ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నాకు వచ్చిన సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నాను. నాకైతే అందరు హీరోలతో, దర్శకులతో పని చేయాలనుంది.

ప్ర) మీరు సినిమా సైన్ చేసేప్పుడు ఎలాంటి కండిషన్స్ పెడతారు ?
జ) సినిమాకు ఒప్పుకునే ముందు డైరెక్టర్ తో అన్నీ చెప్పేస్తాను. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో నాకు నచ్చితేనే చేస్తానని క్లారిటీగా చేప్పేస్తాను.

ప్ర) ప్రభాకర్ గారు సినిమాను ఎలా డీల్ చేశారు ?
జ) ఆయన యాక్టర్ కూడా కాబట్టి మాకు కష్టము కూడా తగ్గిపోయింది. ఆయనకు ఎలా కావాలో నటించి చూపించేవారు. అందుకే మాకు పని చాలా ఈజీగా ఉండేది. నటుడవడమనేది దర్శకుడిగా ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.

ప్ర) గీతా ఆర్ట్స్ బ్యానర్ తో చేయడం మీ కెరీర్ కు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారా ?
జ) ప్రస్తుతానికైతే అంతా బాగుంది. సినిమా రిజల్టును మీదే ఆ విషయం ఆధారపడి ఉంటుంది.

ప్ర) నీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) ఇంకా వేటికీ ఫిక్సవ్వలేదు. మంచి కథల కోసం వైట్ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా జరుగుతోంది. ప్రస్తుతానికి టీవీ షోలు చేస్తున్నాను.