ట్రెండ్ అనుసరించడం ఇష్టం లేదు – బాలకృష్ణ.

balakrishna1

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెటారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన తొలిచిత్రం ‘తాతమ్మ కల’ విడుదలై ఆగస్ట్ 30వ తేదితో 40 వసంతాలు పూర్తయ్యాయి. 1974 ఆగస్ట్ 30న విడుదలైన ‘తాతమ్మ కల’ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకేక్కడం విశేషం. నటుడిగా ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు చేశారు బాలయ్య. ఒక్కసారి సినిమాకు సైన్ చేసిన తర్వాత దర్శకుడి పనిలో వేలు పెట్టడం బాలయ్యకు ఇష్టం ఉండదు. దర్శకుడిపై పూర్తి విశ్వాశం ఉంచుతారు. ఆయనలో ఆ నైజం అగ్ర హీరోను చేసింది. ఎన్నో ఘన విజయాలను అందించింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘అభిమానులు, ప్రేక్షకులు తన సినిమా నుండి ఎం ఆశిస్తారో అవి ఉండేలా చూసుకుంటూ, కొత్తదనం ఉండే కథలకు నా ఓటు. ప్రేక్షకులు కోరుకున్నది మనం ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం కథ రాశాం, మిమ్మల్ని కొత్తగా చూపిస్తాం అని ఎవరైనా దర్శకుడు వస్తే సినిమా చేయనని చెప్పేస్తా. తలా తోకా లేని ట్రెండ్ నేను ఫాలో కాను అని అన్నారు.

Exit mobile version