ఇంటర్వ్యూ: లావణ్య త్రిపాఠి – నేను లవ్ స్టోరీలు పెద్దగా చూడను. కానీ అవే చేస్తున్నాను !
Published on Oct 22, 2017 12:49 pm IST

రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ఈ నెల్ 27న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నా పాత్ర చాలా ఇన్నోసెంట్, స్మార్ట్ గా ఉంటుంది. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటుంది. రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. ఈ పాత్ర వచ్చినందుకు లక్కీగా ఫీలవుతున్నాను.

ప్ర) మీరు చాలా లవ్ స్టోరీల్లో నటించారు. వాటికి ఈ సినిమాకి తేడా ఏంటి ?
జ) ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. ప్రస్తుతం జనరేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఈజీగా కనెక్టైపోతుంది.

ప్ర) జిందగీ పట్ల మీ అభిప్రాయమేంటి ?
జ) లైఫ్ ను మరీ సీరియస్ గా తీసుకోకూడదు. ఒకసారి వచ్చిన మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి దాన్నీ ఎంజాయ్ చేయాలి.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత ?
జ) దాని గురించి చెప్పకూడదు. అయినా పాత్ర లెంగ్త్ ముఖ్యం కాదు. కథలో ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటనేదే ముఖ్యం. ఉదాహరణకి రాజుగారి గదిలో సమంత పాత్ర చిన్నదే అయినా అందరూ ఆ పాత్ర గురించే ఎక్కువ మాట్లాడారు. అందుకే నేను లెంగ్త్ గురించి అస్సలు పట్టించుకోను.

ప్ర) లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారా ?
జ) చేయాలనే ఉంది. దానికి మంచి కథ, సరైన దర్శకుడు, మంచి రైటర్స్ కావాలి. అప్పుడే బాగా వస్తుంది. అవన్నీ కరెక్టుగా కుదిరితే చేస్తాను.

ప్ర) హర్రర్ జానర్ సినిమాల్లో నటిస్తారా ?
జ) హర్రర్ నా ఫెవరెట్ జానర్. ఆ సినిమాలు ఎక్కువగా చూస్తాను. కానీ వాటిలో మాత్రం నటించను. అలాగే లవ్ స్టోరీలు అస్సలు చూడను. కానీ కెరీర్ పరంగా మాత్రం అన్నీ అలాంటివే చేస్తున్నాను.

ప్ర) రామ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నేను రామ్ కి పెద్ద ఫ్యాన్ ని. మంచి నటుడు. ఈ సినిమాలో అతని నటన అందరికీ నచ్చుతుంది. అతనితో పని చేయడం మంచి అనుభవం.

ప్ర) సినిమాలు కాకుండా కొత్త బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా ?
జ) ఖచ్చితంగా చేస్తాను. కానీ ఇప్పుడే అని చెప్పలేను. ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుంది. అంటే ఫుడ్, ఫిట్నెస్ రంగాలకి సంబందించిన బిజినెస్ చేయాలనుంది.

ప్ర) గీతా ఆర్ట్స్ సినిమా నుడ్ని బయటికి రావడానికి కారణం ?
జ) గీతా ఆర్ట్స్ నాకు ఫ్యామిలీ లాంటిది. డేట్స్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చి ఆ సినిమా నుని బయటకు రావాల్సి వచ్చింది. అంతేగాని వేరే సమస్యేమీ లేదు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ఈ సంవత్సరం ఇప్పటికే నావి నాలుగు సినిమాలు వచ్చాయి. ఇంకా కొన్నిటికి సైన్ చేయాలనుకుంటున్నాను. సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ చూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కి చాలా ప్లాన్స్ ఉన్నాయ్.

 
Like us on Facebook