ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: కారుణ్య‌ చౌదరి – మహేష్ బాబుగారి లాంటి వారితో నటించడం చాలా ఆనందంగా ఉంది !


ప‌వ‌న్‌, కారుణ్య‌ చౌదరి జంటగా న‌టించిన సినిమా `ఏటీఎం వ‌ర్కింగ్‌’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘గంగపుత్రులు’ వంటి మంచి సందేశాత్మక చిత్రంతో అందరి ప్రసంశలు అందుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేశారు. మార్చి 17న చిత్ర రిలీజ్ సందర్బంగా హీరోయిన్ కారుణ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) చెప్పండి మీ సినీ కెరీర్ ఎలా మొదలైంది ?
జ) నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. ఎక్కువ సినిమాలు చూసేదాన్ని. అలా సినిమాల్లోకి రావాలనే కోరిక కలిగింది. నాకు మొదటి అవకాశం మహేష్ బాబుగారి ‘శ్రీమంతుడు’ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ చెల్లెలిగా నటించే అవాకాశం వచ్చింది.

ప్ర) మొదటిసారి అంత పెద్ద నటీనటులతో నటిచడం ఎలా అనిపించింది ?
జ) కాస్త భయమేసింది. సెట్లో మహేష్ బాబుగారు, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్ వంటి పెద్ద పెద్ద స్టార్లను ఒకేసారి చూసేసరికి కంగారుగా అనిపించింది. కానీ వాళ్లంతా సెట్లో అందరితో సరదాగా ఉండేవారు. ఆ అనుభవం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నాది అప్సర అనే ఒక కాలేజ్ అమ్మాయి పాత్ర. చాలా కామన్ గా ఉంటుంది. హీరో కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని ముందుకు నడిపించే క్యారెక్టర్. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ప్ర) ఈ ‘ఏటీఎం వర్కింగ్’ సినిమా మీకు మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారా ?
జ) అవును. సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ తర్వాత నాకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. సినిమా సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాను. ఇది నా కెరీర్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ప్ర) డైరెక్టర్ సునీల్ గారితో వర్క్ ఎలా ఉంది ?
జ) సునీల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆయనకు నటీనటుల నుండి ఎలాంటి నటన కావాలో స్పష్టంగా తెలుసు. అందుకే ఆయనతో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది.

ప్ర) సినిమాల్లోకి వస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీలయ్యారు ?
జ) మొదట సినిమాలోకి వెళతానంటే కంగారుపడ్డారు. ముఖ్యంగా మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. కానీ నాన్న, మావయ్య సపోర్ట్ చేశారు.

ప్ర) ఫ్యూచర్ లో ఎలాంటి పాత్రలు చేయాలనుంది ?
జ) నాకు ఒక్క హీరోయిన్ గా మాత్రమే చేయాలనేం లేదు. మంచివి సపోర్టింగ్ రోల్స్ అయినా సరే చేస్తాను. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేదే నా ఉద్దేశ్యం.

ప్ర) మీకంటూ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ?
జ) పర్టిక్యులర్ గా డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేవు. కానీ ‘అంతులేని కథ’ చిత్రంలో జయసుధ గారి పాత్ర అంటే చాలా చాలా ఇష్టం.

ప్ర) ఇంకా ఏయే సినిమాలు చేస్తున్నారు ?
జ) ఈ సినిమా కాకుండా ‘వసుదైక’ అనే బైలింగ్యుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సీత అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇంకా ‘ద్యావుడా’ అనే సినిమాలో కూడా చేశాను.