హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందట

Published on Sep 24, 2023 9:35 pm IST


దర్శకుడు అట్లీ కుమార్ పేరు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోతోంది. నిజంగా ఆ స్థాయిలోనే జవాన్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అందుకే, ఇప్పుడు అట్లీ తర్వాత సినిమా పై అందరి దృష్టి పడింది. అయితే, తనకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని అట్లీ చెప్పి షాక్ ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ.. “నేను స్పానిష్ సినిమా చేయవచ్చు. వారు (హాలీవుడ్ వారు) నాకు కాల్ చేసి.. ఒకవేళ మీరు హాలీవుడ్‍లో పని చేయాలనుకుంటే మాకు చెప్పండి’ అని అడిగారు.

జవాన్ సినిమా వారికి బాగా నచ్చింది. పైగా ఇంతకు ముందు ఇలాంటి సినిమా (జవాన్) చూడలేదనే సరికి నేను దేవుడా అని ఆశ్చర్యపోయాను. ఈ ఐడియా మనకు మాత్రమే పని చేస్తుందని నేను అనుకున్నా. కానీ గ్లోబల్‍ గా కూడా ఇది వర్కౌట్ అవుతోంది” అని అట్లీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి భవిష్యత్తులో అట్లీ హాలీవుడ్ లో కూడా సినిమా చేస్తాడేమో చూడాలి. పక్కా మాస్ సినిమాలు తీయడంలో.. అలాగే వరుసగా భారీ విజయాలను నమోదు చేయడంలో అట్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. బహుశా ఇందుకే హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చి ఉంటుంది.

సంబంధిత సమాచారం :