చిరంజీవి లాంటి స్టార్‍ను ఎక్కడా చూడలేదు : కాజల్

kajal
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా ఆయన క్రేజ్ తగ్గలేదని ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఋజువుచేసేస్తున్నాయి. ఇక తమ సినిమాకు ఇంతటి విజయాన్ని తెచ్చిపెట్టిన వారికి టీమ్ థ్యాంక్స్ తెలిపింది. హీరోయిన్ కాజల్ కొత్త సంవత్సరాన్ని ఒక సూపర్ హిట్‌తో మొదలుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఖైదీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ చిరంజీవి ల్యాండ్‌మార్క్ సినిమాలో భాగమవ్వడం తన అదృష్టం అన్నారు.

“చిరంజీవి గారి రీ ఎంట్రీ సినిమా అనగానే నిమిషం ఆలోచించకుండా ఓకే చెప్పా. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ సృష్టిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి. అంతపెద్ద స్టార్ అయి ఉండి కూడా ఎక్కడా ఒకర్ని తక్కువ చేసి చూడరు. చిరు లాంటి స్టార్ ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం కొత్తగా అనిపించింది. నన్నడిగితే చిరంజీవి లాంటి స్టార్‌ను నేనెక్కడా చూడలేదని చెబుతా” అంటూ కాజల్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 150’ని చిరు తనయుడు రాం చరణ్ నిర్మించారు.