ఇంటర్వ్యూ : ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను – హీరోయిన్ కృతి శెట్టి

ఇంటర్వ్యూ : ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను – హీరోయిన్ కృతి శెట్టి

Published on May 6, 2023 8:12 PM IST

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి ల కలయికలో వెంకట్ ప్రభు ప్రస్తుతం తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కస్టడీ. నాగ చైతన్య ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేస్తుండగా శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే కస్టడీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక ఈ మూవీ మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా నేడు ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు హీరోయిన్ కృతి శెట్టి. .

 

కస్టడీ లో మీ పాత్రలో నచ్చింది ఏమిటి ?
కస్టడీ కథలో నా పాత్రకు చాలా ప్రాధన్యత వుంది. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రీన్ ప్లే తో నా పాత్ర ప్రయాణిస్తూ వుంటుంది. నటనకు ఆస్కారం వుండే పాత్ర. నా పాత్ర నిడివి కూడా ఎక్కువే. సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, కానీ కస్టడీ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత మార్వల్స్ స్టూడియో నుంచి నాకు కాల్ వస్తుందని వెంకట్ ప్రభుగారితో చెప్పాను (నవ్వుతూ). నా పాత్రలో మంచి ఎమోషన్ వుంటుంది. తప్పుకుండా ఈ పాత్ర మరింత మంచి గుర్తింపు అందిస్తుందని నా నమ్మకం.

 

అండర్ వాటర్ సీక్వెన్స్ ఆసక్తికరంగా వుంటుందని విన్నాం ?
అవును, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. దాదాపు 15 రోజులు ఆ సీక్వెన్స్ చేశాం. ఒక ఐదు రోజుల పాటు కంటిన్యూ గా వాటర్ లోనే వున్నాం. దాని కోసం రెండు రోజులు శిక్షణ తీసుకున్నాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిముషాలు పాటు వుంటేనే ఒక షాట్ సాధ్యపడుతుంది. ఒక దశలో నాకు భయం వేసింది. కానీ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూనిట్ ఎంతో జాగ్రత్తగా ఆ సీన్ ని చిత్రీకరించారు.

 

నాగ చైతన్య తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నాగ చైతన్య గారు నా ఫేవరట్ నటుడే కాదు వ్యక్తి కూడా. తను చాలా నిజాయితీగా వుంటారు. ఈ కథలో పాత్రలు చాలా కంఫర్ట్ బుల్ గా వుండాలి. నేను ఆ ఫ్ స్క్రీన్ చై తో కంఫర్ట్ బుల్ గా వుంటాను కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. మా ఇద్దరి పెయిర్ ఈ మూవీలో మీ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.

 

కస్టడీ షూటింగ్ అనుభవాలు గురించి చెప్పండి ?
కస్టడీ సెట్స్ లో నేను రౌడీలా వున్నానని వెంకట్ ప్రభు గారు అన్నారు (నవ్వుతూ). పర్శనల్ గా నేను కొంచెం రౌడీనే (నవ్వుతూ). ఏదైనా అవతలి వాళ్ళు నాకు ఇచ్చే కంఫర్ట్ ని బట్టి వుంటుంది. చైతు గారితో మళ్ళీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ వుంటుంది. అలాగే అరవింద్ స్వామీ గారు, శరత్ కుమార్ గారు, సంపత్ గారు, వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా చక్కని టీంతో పని చేయడం మంచి అనుభూతి. మొత్తంగా సినిమా అవుట్ పుట్ కూడా బాగా రావడంతో అందరం ఎంతో హ్యాపీ

 

వెంకట్ ప్రభుగారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
వెంకట్ ప్రభు గారు చాలా ఫ్రెండ్లీ. చాలా కేరింగ్ గా చూసుకుంటారు. చాలా స్వీట్ పర్శన్. అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సినిమా ఆద్యంతం అద్భుతంగా తెరకెక్కించారు.

 

కెరీర్ లో అపజయాలని ఎలా చూస్తారు ?
ఎవరికీ సక్సెస్ రెసెపీ తెలీదు. నిజానికి మన ప్రయత్నం మనం చేస్తాం. జయాపజయాలు ప్రయాణంలో భాగమే. అయితే అపజయం వచ్చినపుడు దాని విశ్లేషించుకొని మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇకపై ఆడియన్స్ మెచ్చే మరిన్ని మంచి పాత్రలు చేయాలనేదే నా తాపత్రయం.

 

లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా?
ప్రస్తుతానికి లేదండీ. భవిష్యత్ లో మంచి కథ వస్తే దాని గురించి ఆలోచిస్తాను. భవిష్యత్తులో వస్తాయని అనుకుంటున్నా.

 

బాలీవుడ్ వైపు ఆలోచనలు ఉన్నాయా ?
ప్రతి భాషలో మంచి డెబ్యు సినిమా వుండాలి. డెబ్యు సినిమా చాలా ముఖ్యం. అలాంటి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా. అన్ని కుదిరితే అక్కడ కూడా చేయడానికి రెడీ

 

దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయా ?
నాకు దర్శకత్వం చేయాలనే వుంది. అయితే అది ఇప్పుడే కాదు. నేను ప్రతి విషయాన్ని పరిశీలిస్తాను. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. కెరీర్ మరింతగా సాగిన అనంతరం ఆలోచిస్తాను.

 

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
శర్వానంద్ గారితో ఓ సినిమా చేస్తున్నా. ఓ మలయాళం సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇవే.
థాంక్యూ … అల్ ది బెస్ట్

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు