ఇంటర్వ్యూ : నాగ అన్వేష్ – ‘ఏంజెల్’ సినిమాలో కామెడీ, గ్రాఫిక్స్ హైలెట్ గా ఉంటాయి !

ఇంటర్వ్యూ : నాగ అన్వేష్ – ‘ఏంజెల్’ సినిమాలో కామెడీ, గ్రాఫిక్స్ హైలెట్ గా ఉంటాయి !

Published on Nov 2, 2017 1:05 PM IST

‘వినవయ్యా రామయ్య’ తో హీరోగా పరిచయమైన బాలనటుడు నాగ అన్వేష్ చేస్తున్న మరొక సినిమా ‘ఏంజెల్’. బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపు 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా నాగ అన్వేష్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్టైంది ?
జ) ఈ సినిమాకు ఒకటిన్నర సంవత్సరం స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఆ తర్వాత 4 నెలలు షూటింగ్ జరిపి, 6 నెలలు సీజీ వర్క్ చేశాం.

ప్ర) ఈ సినిమాలో ఏయే అంశాలు హైలెట్ గా ఉంటాయి ?
జ) ఇందులో కామెడీ ప్రధానంగా ఉంటుంది. దాంతో పాటే సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కథ కూడా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.

ప్ర) రెండవ సినిమాగా సోషియో ఫాంటసీ కథ చేయటానికి కారణం ?
జ) ప్రత్యేకంగా కారణాలేవీ లేవు. కథ నచ్చింది. అందుకే చేసేశాను.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఈ సినిమాలో నాది కొంచెం మాస్ క్యారెక్టర్. ఇందులో స్మగ్లర్ గా కనిపిస్తాను. న అపాత్రలో ఫన్ కూడా ఉంటుంది.

ప్ర) అసలు ఈ సినిమా కథేమిటి ?
జ) నేను, సప్తగిరి ఒక విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనే హెబ్బా పటేల్ స్వర్గం నుండి కిందికి వస్తుంది. ఆమె మమ్మల్ని ఎందుకు కలిసింది, మా జర్నీ ఎలా సాగింది అనేదే సినిమా కథ.

ప్ర) సినిమాని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్టున్నారు ?
జ) ముందు తెలుగు చేస్తున్నాం. ఆ తర్వాత తమిళం, హిందీలో కూడా విడుదల చేయాలనే ఆలోచన ఉంది.

ప్ర) మొదటి సినిమాకి ఈ సినిమాకి మీలో ఎలాంటి మార్పులు చూడొచ్చు ?
జ) నా మొదటి సినిమాలో కొంచెం సన్నగా కనిపించాను. అందరూ కొద్దిగా బరువెక్కితే బాగుంటుందని అన్నారు. అందుకే కాస్త ఫిజిక్ పెంచాను. పెర్ఫార్మెన్న్ పరంగా కూడా ఇంఫ్రూమెంట్ చూస్తారు.

ప్ర) సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి ?
జ) ముందుగా కేవలం 12 నిముషాల పాటే గ్రాఫిక్స్ పెడదామని అనుకున్నాం. కానీ అవి కాస్త 40 నిముషాలకు పెరిగాయి. అందుకే రిలీజ్ కాస్త లేటైంది. గ్రాఫిక్స్ అన్నీ మంచి క్వాలిటీలో ఉంటాయి. స్వర్గాన్ని సరికొత్త తరహాలో చూపిస్తాం. అంతేగాక క్లైమాక్స్ ఫైట్ కూడా గ్రాఫిక్స్ తోనే తీశాం.

ప్ర) ఈ సినిమాతో మీ అమ్మ, నాన్నలు హ్యాపీగా ఉన్నారా ?
జ) చాలా సంతోషంగా ఉన్నారు. ఔట్ ఫుట్ చాలా బాగొచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు