ఇంటర్వ్యూ : మహేష్ బాబు – ‘స్పైడర్’ వలన చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను!

ఇంటర్వ్యూ : మహేష్ బాబు – ‘స్పైడర్’ వలన చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను!

Published on Sep 25, 2017 5:46 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బుధవారం ‘స్పైడర్’ చిత్రంతో మన ముందుకురానున్నాడు. భారీ అంచనాల నడుమ రిలీజవుతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. చిత్ర రిలీజ్ సందర్బంగా మహేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మురుగదాస్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) చాలా ఎగ్జైటెడ్ గా ఫీలవుతున్నాను. ఆయనలాంటి గొప్ప దర్శకుడితో వర్క్ చేయడం మంచి అనుభవం. చాలా ఏళ్ల నుండి ఆయనతో పనిచేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ‘స్పైడర్’ సినిమా చేయడానికి మొదటి కారణం ఆయనే. నా మొదటి ద్విభాషా చిత్రం ఆయనతోనే చేయడం ఇంకో గొప్ప విషయం.

ప్ర) ఒకేసారి రెండు భాషల్లో చేయడం కష్టమనిపించలేదా ?
జ) మొదట్లో ఏముంది ఒకేసారి రెండు భాషల డైలాగ్స్ చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకున్నాం. కానీ మూడురోజులు పనిచేశాక అందులోని కష్టం ఏమిటో తెలిసింది. తెలుగు, తమిళ్ రెండింటికీ వేరు వేరు మాడ్యులేషన్స్ ఉంటాయి. నటులు కూడా వేరుగా ఉంటారు. చాలా కష్టమైన పని అది. మురుగదాస్ లాంటి గొప్ప దర్శకులకే అది సాధ్యపడుతుంది.

ప్ర) టీజర్లో చూపిన స్పైడర్ సినిమాలో ఉంటుందా ?
జ) అది టీజర్లో మాత్రమే ఉంటుంది. సినిమాలో ఉండదు. హీరో క్యారెక్టర్ ని పరిచయం చేయడానికి మాత్రమే దాన్ని వాడాం.

ప్ర) షూటింగ్ ఎలా జరిగింది ?
జ) 190 రోజుల పాటు షూట్ చేశాం. ఎక్కువ భాగం నైట్ ఎఫెక్ట్స్ లోనే ఉంటుంది. అన్ని రోజులు అంత మందిని కంట్రోల్ చేయడానికి, సెట్స్ లో ఎనర్జీ తగ్గకుండా చూసుకోవడానికి మురుగదాస్ గారు చాలా కష్టపడ్డారు.

ప్ర) సినిమాలోని ఆసక్తికర అంశాలు ఏమిటి ?
జ) ఇందులో మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఎమోషన్ ఉంటుంది. మురుగదాస్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇందులో కూడా అలానే ఉంటుంది. ఇంకా హైలైట్స్ ఉంటాయి. సినిమా చూస్తే అర్థమవుతుంది.

ప్ర) రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పండి ?
జ) నాకంటే తెలుగు, తమిళ్ రెండు భాషలు బాగా వచ్చు కాబట్టి చేసేశాను. కానీ రకుల్ అలా కాదు. తమిళం అంత బాగా రాకపోయినా కష్టపడి చేసింది. ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వలేదు.

ప్ర) హరీశ్ జైరాజ్ మ్యూజిక్ ఎలా వచ్చింది ?
జ) ఆయన పాటలు వినగా వినగా ఎక్కుతూ ఉంటాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే ఇలా కూడా చేయొచ్చా అనిపిస్తుంది. చాలా మంచి స్కోర్ ఇచ్చారాయన.

ప్ర) రెండు లాంగ్వేజెస్ కదా రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందా ?
జ) ఖచ్చితంగా. తెలుగు వెర్షన్ చూస్తే తెలుగువాళ్ళకు, తమిళ వెర్షన్ చూస్తే తమిళులకు పూర్తిగా నచ్చుతుంది. సబ్జెక్ట్ అలాంటిది. పర్ఫెక్షన్ కోసం రెండు భాషల్లో వేర్వేరు నటులతో షూట్ చేశాం.

ప్ర) ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నారు ?
జ) రెండు భాషల్లో చేయడానికి కష్టపడటం వలన కేవలం తెలుగులోనే చేసే సినిమాలు ఈజీగా అనిపిస్తున్నాయి. కొరటాల శివ సినిమా చేస్తున్నప్పుడు తెలుగు ఒక్కటే కాబట్టి ఇంతేనా అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. అలాగే ఈ సినిమా వలన సహనం కూడా ఇంకాస్త పెరిగింది.

ప్ర) రాజమౌళిగారితో సినిమా ఖాయమేనా ?
జ) అవును. కలిసి వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు, ఆయనకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తవగానే మా ప్రాజెక్ట్ మీద వర్క్ స్టార్ట్ చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు