ఇంటర్వ్యూ : లంక ప్రతీక్ – డైరెక్షన్, యాక్షన్ పెద్ద కష్టమనిపించలేదు !
Published on Dec 7, 2017 4:05 pm IST

లంక ప్రతీక్ హీరోగా నటించిన చిత్రం ‘వానవిల్లు’ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా గురించి చెప్పండి ?
జ) ఈ సినిమాకి వానవిల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూశాక తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. అలాగని రెగ్యులర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఇందులో ఒక సస్పెన్స్ ఉంటుంది.

ప్ర) మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) జాలీగా ఉండే ఒక ఇంజనీరింగ్ కుర్రాడిలా కనిపిస్తాను. క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాకి హీరోగానే కాక డైరెక్షన్ కూడా చేశారు. ఎందుకలా ?
జ) ఏదైనా సినిమాలోని ఒక సీన్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే నేను దాని వెనుక ఎలాంటి వర్క్ ఉంది అనేది చూస్తాను. నాకు చిన్నప్పటి నుండి టెక్నికల్ విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే చేశాను.

ప్ర) హీరోగా కూడా మీరే చేయాలని ముందుగా అనుకున్నారా ?
జ) లేదు ముందుగా హీరో నేనే అని అనుకోలేదు. కొత్త హీరోని పెట్టి తీద్దామనుకున్నా. అది మా నాన్న ఐడియా. నా షార్ట్ ఫిల్మ్ అన్నింటిలో కూడా నేనే చేసేవాడిని.

ప్ర) ఒకేసారి డైరెక్షన్, యాక్షన్ కష్టం అనిపించలేదా ?
జ) అంటే ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదు. అది నాకు నేనే అనుకున్న పని. అందుకే ఎంజాయ్ చేస్తూ చేశాను. కానీ ప్రొడక్షన్ కష్టంగా అనిపించింది.

ప్ర) విడుదలకు కష్టపడాల్సి వచ్చిందా ?
జ) ఆగష్టుకి ఫస్ట్ కాపీ రెడీ అయింది. కానీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఇన్నిరోజులు ఆగాం. ఇప్పటికి కుదిరింది.

ప్ర) మొత్తం ఎన్ని థియేటర్లలో వస్తోంది ?
జ) 100 నుండి 120 స్క్రీన్లలో రిలీజవుతోంది. అవి కూడా దొరకవని అనుకున్నాను. విజయవాడలో కూడా మంచి థియేటర్లు దొరికాయి.

ప్ర) ఆడియన్స్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు ?
జ) ఇద్దరు హీరోయిన్లు కాబట్టి రెగ్యులర్ సినిమా అనుకుంటారు. కానీ ఇది అలా ఉండదు. వేరే పాయింట్స్ మీద సినిమా ఉంటుంది. నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. స్క్రీన్ ప్లే ట్రిక్కీగా ఉంటుంది. మంచి ఫన్ కూడా ఉంటుంది.

ప్ర) హీరోయిన్ల గురించి చెప్పండి ?
జ) ఒకరు కన్నడ హీరోయిన్ శ్రావ్య రావ్. ఆమె కన్నడలో 7 సినిమాలు చేసింది. విశాఖ కొత్త అమ్మాయి. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఇద్దరూ బాగా చేశారు.

 
Like us on Facebook