రామానాయుడు గారి కోరిక మేరకు ‘అహింస’ సినిమా చేశాను – ప్రెస్ మీట్ లో డైరెక్టర్ తేజ

Published on May 31, 2023 12:15 am IST

దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయం అవుతూ తేజ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన తాజా మూవీ అహింస. గీతికా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్‌ గ్రాండ్ గా నిర్మించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 2న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ మూవీకి ఆర్ పి పట్నాయక్ అందించిన సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక నేడు ఈ మూవీ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించింది యూనిట్.

అందులో భాగంగా డైరెక్టర్ తేజ మాట్లాడుతూ, సినిమా కోసం హీరో అభిరాం, హీరోయిన్ గీతిక ఎంతో కష్టపడ్డారని అన్నారు. నిజానికి ఈ సినిమాని తాను దివంగత దిగ్గజ నిర్మాత డి రామానాయుడు గారి కోరిక మేరకు తెరకెక్కించానని అన్నారు. ఆయన తన సంస్థ ద్వారా ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మొత్తంగా ఆయన మనవడితో చేసిన అహింస తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు తేజ.

సంబంధిత సమాచారం :