మూడేళ్ల క్రితమే బాలీవుడ్ సినిమాకి సైన్ చేశా – ప్రభాస్

‘బాహుబలి’ విజయం తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ దేశవ్యాప్తమైంది. అన్ని పరిశ్రమల నుండి ఆయనకు భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు చాలా మంది ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఈ అముఞ్చి తరుణంలోనే బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సంసిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది హిందీ నటులతో కలిసి ఆయన చేస్తున్న ‘సాహో’ బీ టౌన్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

దీంతో పాటే ప్రభాస్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా సైన్ చేశారు. అయితే ఈ కథను ఈ మధ్య కాలంలో కాకుండా దాదాపు మూడేళ్ళ క్రితమే విని, ఓకే చేశారట ఆయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘సాహో’ పూర్తవగానే మొదలుపెడతామని కూడా తెలిపారాయన.