ఇంటర్వ్యూ: ఆశిష్ రాజ్ – నటన నేర్చుకోడానికి ఎక్కువగా రోడ్లమీదే తిరిగాను !

ఇంటర్వ్యూ: ఆశిష్ రాజ్ – నటన నేర్చుకోడానికి ఎక్కువగా రోడ్లమీదే తిరిగాను !

Published on Mar 7, 2017 5:21 PM IST


దర్శకుడు రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆకతాయి’ తో ఆశిష్ రాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా మార్చి 10 శుక్రవారం రిలీజ్ కానున్న సందర్బంగా ఆశిష్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) అసలు మీ నైపథ్యం ఏంటి ?
జ) నేను హైదరాబాద్లోనే పుట్టి, పెరిగాను. థియేటర్స్ ఆర్ట్స్ చేశాను. ఆ పనిలో ఉండగానే కొందరు బాగున్నావ్ మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అంటే అప్పుడప్పుడు చేసేవాడ్ని, ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఇప్పుడు ‘అకతాయి’ సినిమాతో హీరోగా వస్తున్నాను.

ప్ర) ఈ అవకాశం ఎలా వచ్చింది ?
జ) లాస్ట్ ఇయర్ ఎంబీఏ చేస్తున్నప్పుడే కొన్ని యాడ్స్ కోసం బాబాయి వెళ్ళాను. అప్పుడే డైరెక్టర్ ని కలిశాను. ఆయన స్టోరీ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఆయన హీరోగా చేస్తావా అని అడిగారు. కాస్త ఆలోచించాను. అయినా ఒప్పుకున్నాను. ఆ తర్వాత డ్యాన్సింగ్, ఫుట్స్ అన్నింటిలో ట్రైనింగ్ తీసుకుని షూటింగ్ కు వెళ్ళాను.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు విక్రాంత్. ఒక ఆకతాయి పాత్ర. అంటే చక్కగా కాలేజ్ కు వెళ్తూ చదువుకుంటూనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే అతనికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. వాటి నుండి అతను ఎలా బయటపడ్డాడు అనేదే కథ. చాలా థ్రిల్లింగా ఉంటుంది.

ప్ర) హీరోయిన్ గురించి చెప్పండి ?
జ) హీరోయిన్ ఇందులో చాలా అందంగా ఉంటుంది. తను ప్రేమించిన అబ్బాయి ప్రాబ్లమ్స్ లో పాడినప్పుడు ఎలా ఫీలవుతుంది, అతనికి తోడుగా ఎలా ఉంటుంది, ఆమె వలన ఆ అబ్బాయి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఆమె చుట్టూ తిరిగే కథ.

ప్ర) డైరెక్టర్ గురించి చెప్పండి ?
జ) ఆయనకు మంచి విజన్ ఉంది. నాకు స్క్రిప్ట్ మొత్తం రెండున్నర గంటలు చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు నేనేదైతే ఇమాజిన్ చేసుకున్నానో అలానే తీశారు. అంత బాగా తీస్తారని నేననుకోలేదు. నా పాత్ర కూడా గొప్పగా ఎలివేట్ అయింది.

ప్ర) సినిమా ఎలా వచ్చింది ?
జ)సినిమాని డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. అంతేగాని పూర్తిగా సపరేట్ గా చూడలేదు. అందరితో పాటే థియేటర్లో చూస్తాను.

ప్ర) మీకు ఏ ఎలిమెంట్ అంటే ఎక్కువ ఇష్టం ?
జ) నాకు డ్యాన్స్, ఫైట్స్ కన్నా నటన అంటే ఎక్కువ ఇష్టం. అది రొమాన్స్ కానీ, కామెడీ కానీ ఏదైనా సరే పెర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ ఇష్టం. నటనలో నేర్చుకోడానికి రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతూ, ఎవరెవరు ఏయే పరిస్థితులకు ఎలా ఫీలవుతారో నేర్చుకున్నాను.

ప్ర) కొత్త ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా ?
జ) ఆఫర్స్ అంటే వస్తున్నాయి. కానీ ఇంకా వేటినీ పూర్తిగా ఒప్పుకోలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఏదైనా సినిమా విడుదలయ్యాకే డిసైడవ్వాలి.

ప్ర) ప్రమోషన్లలో కాస్త ఎమోషన్ అయినట్టున్నారు ?
జ) అవును.. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. మనం ఏం చేయాలో తెలిసి ఎక్కడ నుండి ప్రారంబించాలో తెలియకపోతే ఎవరెవరో వచ్చి ఏది ఎలా చెయ్యాలో చెప్పినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. నాకు ఎవరు ఏ మంచి చెప్పినా అస్సలు మర్చిపోలేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు