ఇంటర్వ్యూ : అనిల్ గోపిరెడ్డి – ఆడవాళ్ళ ప్రేమ ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమా చేశాను !

‘వైకుంఠపాళి, బిస్కెట్’ చిత్రాల దర్శకుడు అనిల్ గోపిరెడ్డి డైరెక్ట్ చేసిన చిత్రం ‘సీత రాముని కోసం’. ట్రైలర్స్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా అనిల్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ సినీ గురించి చెప్పండి ?
జ) నా మొదటి సినిమా 2011లో ‘వైకుంఠపాళి’, రెండోది 2014లో ‘బిస్కెట్’, ఇప్పుడు ‘సీత రాముని కోసం’. ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ నేనే చేశాను.

ప్ర) ‘సీత రాముని కోసం’ ఎలాంటి చిత్రం ?
జ) ఒక స్త్రీ ప్రేమ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అనేది చూపించడమే ఈ సినిమాలోని ప్రధాన కాన్సెప్ట్. అమ్మాయి ప్రేమించడం మొదలుపెడితే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో చూపిస్తాం. సినిమా వరల్డ్ వైడ్ గా 250 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) ఇలాంటి కథ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి ?
జ) అంటే ఒక జానర్ కె పరిమితం కాకుండా చిన్న పిల్లల దగ్గర్నుండి 60 ఏళ్ల వయసు వాళ్లకు కూడా నచ్చాలి అనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను.

ప్ర) ఇందులో హర్రర్ కంటెంట్ ఉంటుందా ?
జ) అంటే ఇందులో ఆత్మ ఉంటుంది. కానీ భయపడరు థ్రిల్ అవుతారు. సీత చనిపోయి హీరో కోసం వస్తుంది.

ప్ర) మ్యూజిక్ డైరెక్టర్ జర్నీ ఎలా ఉంది ?
జ) మ్యూజిక్ డైరెక్టర్ గా ఇది నా ఎనిమిదో సినిమా. మొదటి సినిమా ‘ముహూర్తం’ కు నంది అవార్డ్ వచ్చింది. రెండో సినిమా ‘వైకుంఠపాళి’, మూడోది ఉదయ్ కిరణ్ తో ‘ఏకలవ్యుడు’, తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా, బిస్కెట్, బస్ స్టాప్’ ఇప్పుడు ఇది.

ప్ర) ఈ సినిమాలోని నటీనటుల గురించి చెప్పండి ?
జ) సీత పాత్ర చేసిన కారుణ్య చౌదరి కాకుండా హీరోగా యూఎస్ నుండి వచ్చిన శరత్ శ్రీరంగం చేశారు, తాగుబోతు రమేష్ కూడా ఒక నాలుగు నిముషాల పాటు ఒక కీ సీన్లో కనిపిస్తాడు.

ప్ర) ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటి ?
జ) న్యూస్ పేపర్లో ఓక్ ఆర్టికల్ చదివాను. అదేమిటంటే భర్త కాదన్నాడని బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్న భార్య. అది చదివాక ప్రేమ పట్ల ఆడవాళ్లు ఇంత ఎమోషనల్ గా ఉంటారా అనిపించింది. ఆ పాయింట్ కి ఎమోషన్ యాడ్ చేసి సినిమా చేశాను.

ప్ర) నీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) సంక్రాంతి నుండి ఒక సినిమా స్టార్ట్ చేయాలి. దాన్ని తెలుగులో చేయాలా కన్నడలో చేయాలా లేకపోతే రెండింటిలో చేయాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదు.

Exit mobile version