ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉంది – జాన్వీ కపూర్

ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉంది – జాన్వీ కపూర్

Published on Oct 27, 2022 3:01 AM IST

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా మంచి అవకాశాలతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న యువ నటి జాన్వి కపూర్. తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ దూసుకెుతున్న జాన్వి ఇటీవల గుడ్ లక్ జెర్రీ మూవీ సక్సెస్ తో నటిగా మరింత పేరు అందుకున్నారు. ఇక తన తల్లి శ్రీదేవి మాదిరిగానే తనకు కూడా సౌత్ భాషల్లో నటించాలని ఎంతో ఆసక్తి ఉందని పలు సందర్భాల్లో జాన్వి తెలపడం జరిగింది.

ఇక ఇటీవల ఒకానొక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ, నేటి టాలీవుడ్ యువ నటుల్లో అందరూ తనకు ఇష్టమైనవారే అని అయితే ముఖ్యంగా తనకు అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు జాన్వి. ఇటీవల తాను ఆర్ ఆర్ ఆర్ మూవీ చూశానని అందులో రాంచరణ్ ,ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు జాన్వి. మరి ఆమె కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు