ఇంటర్వ్యూ: మిస్తి చక్రబర్తి – ప్రయోగాత్మకమైన పాత్రలు చేయాలని ఉంది !

30th, April 2017 - 04:39:38 PM


నితిన్ హీరోగా రూపొందిన ‘చిన్నదాన నీకోసం’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ మిస్తీ చక్రబర్తి ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో నటించారు. మే 5న ఈ సినిమా రిలీజ్ సందర్బంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా రీమేక్ కదా.. కథలో మార్పులేమైనా చేశారా ?
జ) అవును చేశారు. హిందీ సినిమాని ఉన్నది ఉన్నట్టు కాపీ కొట్టడం ఇష్టంలేక చాలా మార్పులు చేశారు.

ప్ర) ఈ ఆఫర్ మీదగ్గరకు ఎలా వచ్చింది ?
జ) డైరెక్టర్ నవీన్ మేడారం నన్ను అప్రోచ్ అయ్యారు. స్క్రిప్ట్ చెప్పి హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్ర మీరే చేయాలి అన్నారు. నేను కూడా స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పాను.

ప్ర) కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. నేను నా పాత్రలో ఇన్వాల్ అవడానికి ఆయన నాకు చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చేవారు. షూటింగ్ కూడా సరదాగానే సాగిపోయింది.

ప్ర) మరి మీ కో-స్టార్ శ్రీనివాస్ అవసరాల గురించి ?
జ) నాకు తెలిసి రియల్ లైఫ్ లో ఆయనంత ఇన్నోసెంట్ ఇంకెవరు ఉండరేమో. చాలా మంచివారు. సెట్లో కూడా సరదగా జోక్స్ వేస్తూ ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ అనిపించింది.

ప్ర) ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళతో వర్క్ ఎలా ఉంది ?
జ) నాదంతా సపరేట్ ట్రాక్. వేరుగానే షూట్ చేశారు. షూటింగ్లో వాళ్ళని నేను పెద్దగా కలవలేదు. కానీ చాలా బాగా చేశారని విన్నాను.

ప్ర) ఇంకా ఈ సినిమాలో విశేషాలేమున్నాయి ?
జ) ఇందులో పాటలు చాలా బాగుంటాయి. ప్రతి సిట్యుయేషన్ కి ఒక సాంగ్ ఉంటుంది. అవి వింటున్నంతసేపు చాలా బాగుంటాయి. సినిమాకి అవి కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్.

ప్ర) ఫ్యూచర్లో కూడా గ్లామర్ రోల్స్ చేస్తారా ?
జ) అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే అని కాదు. చాలా గ్లామరస్ రోల్స్ వచ్చాయి. కానీ నాకు కథ నచ్చితే ఎలాంటి పాత్రైనా చేస్తాను. ఉదాహరణకి హిందీలో చేసిన ‘బేగం జాన్’ సినిమాలో నాది పూర్తిగా డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్.

ప్ర) ఇంతకీ ఎలాంటి పాత్రలు మీకిష్టం ?
జ) నాకు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉండాలి. అలాంటి పాత్రలతో ప్రగాలు చేయాలని అనుకుంటున్నాను. నటించటానికి స్కోప్ ఉండే పాత్రలంటే చాలా ఇష్టం.

ప్ర) తెలుగులో ఏమైనా కొత్త సినిమాలు సైన్ చేశారా?
జ) ప్రస్తుతం కొని కథలు వింటున్నాను. వచ్చే నెలలో ఒక సినిమాకి సైన్ చేయాలని అనుకుంటున్నాను. ఏదైనా సరే స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది.