లవ్ స్టోరీ మూవీస్ చేయాలని ఉందంటున్న బాలీవుడ్ బ్యూటీ

Published on Feb 18, 2023 2:45 am IST


బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా పలు అవకాశాలతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో కృతి సనన్ ఒకరు. లేటెస్ట్ గా ఆమె నటించిన అలవైకుంఠపురములో హిందీ రీమేక్ అయిన షెజాదా నేడు విడుదలై మంచి టాక్ అందుకుంది. ఇక ప్రభాస్ తో ఆమె నటించిన భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ లో విడుదల కానుంది. కాగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా వన్ నేనొక్కడినే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా ఆమె బాగా పేరు అందుకున్నారు.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా కృతి సనన్ మాట్లాడుతూ తాను కూడా ఆదిపురుష్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దేశం మొత్తం కూడా ఆదిపురుష్ మూవీ రిలీజ్ తరువాత గర్వంగా భావిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. ఇక తనకు అయితే ప్రత్యేకంగా లవ్ స్టోరీ సినిమాలు చేయాలని ఉందని, స్వచ్ఛమైన ప్రేమకథ కలిగిన స్టోరీస్ తనవద్దకు వస్తే తప్పకుండా చేస్తానని, అలానే అటువంటి పాత్రలకు తాను సరిపోతాననేది తన భావన అన్నారు కృతి సనన్.

సంబంధిత సమాచారం :