అటువంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది – తాప్సి

Published on Jul 16, 2022 12:00 am IST

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం మంచి సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్నారు హీరోయిన్ తాప్సి. లేటెస్ట్ గా ఆమె నటించిన బయోపిక్ మూవీ శభాష్ మిథు. ప్రముఖ లేడీ క్రికెటర్, మాజీ ఇండియన్ విమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ యొక్క జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించారు తాప్సి. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని అజిత్ అందారే నిర్మించారు. రేపు గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ కి సంబంధించి జరిగిన ప్రమోషన్ ఈవెంట్స్ లో భాగంగా ఈ మూవీ అనుభవాలు మీడియాతో పంచుకున్నారు తాప్సి.

ముఖ్యంగా శభాష్ మిథు మూవీ తన వద్దకు వచ్చినపుడు ఒకింత ఛాలెంజింగ్ గా అనిపించించిందని, అలానే మిథాలీ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడి క్రికెట్ నేర్చుకున్నానని చెప్పిన తాప్సి, భవిష్యత్తులో ఇటువంటి రోల్స్ మరిన్ని చేయడానికి సిద్ధం అన్నారు. ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుందనని ఈ మూవీ చేయలేదని, కెరీర్ లో క్రింది స్థాయి నుండి ఎంతో కష్టపడి పైకి ఎదిగి భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన మిథాలీ జీవితం మరింత మందికి తెలియడంతో పాటు ఆమెను అమ్మాయిలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు తాప్సి.

సంబంధిత సమాచారం :