నేనెప్పుడూ ర్యాంకర్ కాదు, రష్మిక అసలే కాదు – విజయ్

vijay-rashmika

విజయ్ దేవరకొండ తన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ను అందజేస్తున్నారు. కాగా ఈ స్కాలర్‌షిప్స్ పంపిణీలో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, విజయ్ దేవరకొండ ఏం మాట్లాడారు అంటే.. “నేనెప్పుడూ 1st, 2nd ర్యాంకర్ కాదు. ఇక నా భార్య రష్మిక అసలే కాదు’ అని నవ్వులు పూయించారు.

విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘కానీ, మనం ఫస్ట్ ర్యాంకర్ కాకపోయినా.. ఫోకస్, డిస్ ప్లేన్ ఉంటే జీవితంలో ఎప్పుడూ గెలుస్తారు. హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. అలాగే, మనం మాట్లాడే మాట, మన బాడీ లాంగ్వేజ్ చూసే పిల్లలు నేర్చుకుంటారు’ అని స్కాలర్‌షిప్స్ పంపిణీ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తెలిపారు. విజయ్ తన స్వగ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ను సాధించారు. అలాగే, అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి భవిష్యత్తులో కూడా ఈ ఉపకారవేతనాలు అందజేస్తానని విజయ్ తెలిపారు.

Exit mobile version