సూపర్ స్టార్ ట్వీట్ తో మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలిగింది – యాక్టర్ సుహాస్

Published on Jan 27, 2023 1:27 am IST


యువ నటుడు సుహాస్ హీరోగా 2020 లో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన కలర్ ఫోటో మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. దాని తరువాత అడివి శేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ హిట్ 2 లో ఒక డిఫరెంట్ రోల్ చేసి ఆకట్టుకున్న సుహాస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న మూవీ రైటర్ పద్మభూషణ్. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 3న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో మంచి లవ్, ఫామిలీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, రోహిణి నటించారు. ఇక తమ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ తో మూవీ అనుభవాలు పంచుకున్నారు సుహాస్.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సుహాస్ మాట్లాడుతూ, సినిమా ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిందని అన్నారు. ఇక దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని, తప్పకుండా ఇది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ చూసి ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన ట్వీట్ తో టీమ్ ని విష్ చేయడం నిజంగా మాటల్లో వర్ణించలేనంత ఆనందాన్ని తనకు కలిగించిందని అన్నారు. అప్పట్లో పోకిరి సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చించుకుని సినిమా చూసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని, అలానే ఆయనకు పెద్ద అభిమానిగా ఆరాధిస్తూ కొనసాగుతున్నానని అన్నారు. అటువంటి సూపర్ స్టార్ తన సినిమాకి ట్వీట్ చేయడం ఎంతో గొప్ప విషయం అని, మహేష్ బాబు గారికి తమ టీమ్ తరపున మరొక్కసారి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :