తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటున్న కన్నడ హీరోయిన్ !

Published on Dec 10, 2017 6:00 pm IST

యంగ్ హీరో నిఖిల్ సూపర్ హిట్ మూవీ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ తో తెలుగు తెరకు పరిచయమైన నటి నందిత శ్వేత ఆ సినిమాలో తన అభినయానికిగాను ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రసంశలు అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె ఇకపై తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అప్పటికే తమిళంలో సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఉండటం వలన మరే తెలుగు సినిమా చేయలేకపోయారామె.

కానీ తాజాగా తణుకులో ఒక షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె సైన్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా పూర్తైపోవడంతో ఇకనుండి తెలుగు చిత్రాలపై ఎక్కువ దృష్టిపెడతానని, ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా చేస్తానని అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More