తన షో కి బాలక్రిష్ణని పిలుస్తానన్న చిరంజీవి !


మెగా అభిమానులు, బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 4 రేపటి నుండి మొదలుకానుంది. స్టార్ మా ఛానెల్ లో రాత్రి 9: 30 నుండి 10:30 వరకు ప్రసారమయ్యే ఈ షో వారంలో సోమ, మంగళ, బుధ మరియు గురు వారాల్లో ప్రదర్శితమవుతుంది. ఇదివరకు నాగార్జున అక్కినేని చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో బాగా పాపులర్ అవడం, చిరంజీవి చేస్తుండటంతో ఈ సిజన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇకపోతే మొత్తం 60 ఎపిసోడ్లు ఉన్న షోలో సెలబ్రిటీ ఎపిసోడ్లు కూడా ఉండనున్నాయి. ఈ ఎపిసోడ్లకు నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలు హాజరవుతున్నారు. ప్రస్తుతం వాటికి సంబందించి షూటింగ్ జరుగుతోంది కూడా. ఇక ఈ రోజు జరిగిన స్టార్ మా ఛానెల్ లోగో ఆవిష్కరణలో బాలకృష్ణ కూడా ఈ షోకి వస్తారా అనే ప్రశ్న రాగానే మెగాస్టార్ ‘నేను, బాలకృష్ణ మంచి స్నేహితులం. ఆయన పుట్టినరోజుకి ఇదే వేదికపై ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. నేను తప్పకుండా ఆయన్ని షోకి పిలుస్తాను. ఆయన కూడా వస్తారే అనుకుంటున్నాను’ అని సమాధానం చెప్పారు.