తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సదా !

Published on Aug 21, 2022 8:49 pm IST


మాజీ హీరోయిన్ సదా అంటే నేటికీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. అయితే, గత కొంతకాలంగా సదా సినిమాలకు దూరంగా ఉంటుంది. మధ్యలో కొన్ని పాత్రల్లో కనిపించినా ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. అయితే, తాజాగా తన పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ సదా ఏం మాట్లాడింది అనేది ఆమె మాటల్లోనే విందాం.

సదా మాట్లాడుతూ.. ‘నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. నేను పార్టీలకు, పబ్స్‌కు పెద్దగా వెళ్లను. అలాగే ఆల్కహాల్ కూడా అస్సలు తాగను. ఇక ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేం. అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకునే వ్యక్తి వెజిటెరియన్‌ అయ్యి ఉండాలి. ఇక అతను ఒకరిపై ఆధారపడకూడదు. అలాగే నా సంపాదనపై నా భర్త ఆధారపడకూడదు. అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను’ అంటూ సదా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :