హీరో శోభన్ లో నా యంగర్ లైఫ్ చూసుకుంటుంటాను – ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని

హీరో శోభన్ లో నా యంగర్ లైఫ్ చూసుకుంటుంటాను – ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని

Published on Oct 30, 2022 1:22 AM IST

యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా లైక్ షేర్ సబ్ స్క్రైబ్. మంచి థ్రిల్లింగ్ యాక్షన్ తో పాటు ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ కామెడీ అంశాలతో దర్శకుడు గాంధీ తెరకెక్కించిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. కాగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయిన్ పల్లి ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, తనకు డైరెక్టర్ మేర్లపాక గాంధీ అంటే ఎంతో ఇష్టం అని, అతడు కథ చెప్పి ఒకసారి ఒప్పించిన తరువాత సెట్స్ లో ఎంతో కలిసిపోతారని, ముఖ్యంగా అయన సరదా శైలి ప్రతి ఒక్కరికీ ఎంతో నచ్చుతుందని అన్నారు. హీరోయిన్ ఫరియా అబ్ద్బుల్లా జాతి రత్నాలు లో బాగా పెర్ఫార్మ్ చేసారని, ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె చేసిన కామెడీ పెర్ఫార్మన్స్ తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ సినిమాతో ఆమెకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇక యువ నటుడు శోభన్ ని ఫస్ట్ టైం గోల్కొండ హై స్కూల్ టైం లోనే చూశానని, అందులో తన పెర్ఫార్మన్స్ ఎంతో నచ్చిందని, అలానే తనతో పాటు శోభన్ కూడా ఇంద్రగంటి మోహన కృష్ణ గారి స్కూల్ వారు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల కొన్నాళ్లుగా శోభన్ కెరీర్ పరిలీలిస్తే మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుంటూ తాను కొనసాగుతున్న తీరు చూస్తుంటే నా యంగర్ లైఫ్ ని తనలో చూస్తున్నట్లు అనిపించిందని అన్నారు నాని. మొత్తంగా యూనిట్ అందరూ ఎంతో కష్టపడి తెరకెక్కించిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుని అందరికీ మంచి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుటకున్నట్లు తెలిపారు నాని.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు