ఆ రోజు కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను – జాన్వీ కపూర్

Published on Mar 7, 2023 3:07 am IST


బాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క ప్రేమాభిమానాలను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తొలిసారిగా ఆమె నటించనున్న సౌత్ సినిమా యొక్క అనౌన్స్ మెంట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థ లు భారీ స్థాయిలో నిర్మించనున్న పాన్ ఇండియన్ మూవీలో ఆమె హీరోయిన్ గా ఎంపికయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితాభిమానమని, ఆయనతో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అంటూ పలు ఇంటర్వ్యూ స్ లో ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్న జాన్వీ, మొత్తంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక ఈ విషయమై నేడు ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఎన్టీఆర్ 30 మూవీ ద్వారా తొలిసారిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండడం ఆనందంగా ఉందని, స్క్రిప్ట్ ఎంతో అద్భుతంగా ఉందని, అలానే ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు తాను ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా అనిరుద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని అతి త్వరలో షూటింగ్ ప్రారంభించి 2024, ఏప్రిల్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :