కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకి దూరం అంటున్న విక్రమ్ డైరెక్టర్….!

Published on Aug 2, 2022 2:00 am IST

కార్తి హీరోగా తెరకెక్కిన ఖైదీ మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్, ఆ తర్వాత ఇలయతలపతి విజయ్ తో మాస్టర్ మూవీ తీసి మరొక సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల ఉలగ నాయగన్ కమల్ హాసన్ తో విక్రమ్ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న లోకేష్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు.

అయితే కొన్నాళ్ళ పాటు తాను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉంటున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా తెలిపారు లోకేష్. మళ్ళీ అతి త్వరలో తన తదుపరి మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాతనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తానని, అప్పటివరకు ప్రేక్షకాభిమనులు తన పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరారు లోకేష్.

సంబంధిత సమాచారం :