‘వాల్తేరు వీరయ్య’ నాన్ ఎస్ఎస్ఆర్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది – వీరయ్య విజయవిహారం ఈవెంట్ లో మెగాస్టార్

‘వాల్తేరు వీరయ్య’ నాన్ ఎస్ఎస్ఆర్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది – వీరయ్య విజయవిహారం ఈవెంట్ లో మెగాస్టార్

Published on Jan 28, 2023 11:25 PM IST


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటించగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో పాటు సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో వాల్తేరు వీరయ్య యూనిట్ నేడు హన్మకొండ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో వీరయ్య విజయ విహారం పేరిట గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఎందరో మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ తరలివచ్చిన ఈ ఈవెంట్ లో వాల్తేరు వీరయ్య యూనిట్ తో పాటు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తమ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, మెగా అభిమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసారు. అలానే కలెక్షన్ పరంగా చూసుకుంటే నాన్ ఎస్ఎస్ఆర్ మూవీగా నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. గతంలో తాను నటించిన రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లోని పాత్రలు మాదిరిగా వాల్తేరు వీరయ్య లోని తన పాత్రని అద్భుతంగా దర్శకుడు బాబీ డిజైన్ చేయడం, అలానే మీ అందరికీ అది ఎంతో కనెక్ట్ అవడం హ్యాపీగా అనిపించిందని అన్నారు.

నిర్మాతలు సినిమా కోసం ఏది కావలిస్తే అది వెంటనే సమకూర్చారని, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా సాంగ్స్ కంపోజ్ చేసారని అన్నారు. హీరోయిన్ శృతి హాసన్ నేడు పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే విషెస్ తెలియచేసిన మెగాస్టార్ ఆమె ఎంతో అద్భుతంగా నటించిందని అన్నారు. తన తమ్ముడు రవితేజ, విక్రమ్ సాగర్ పాత్రలో అత్యద్భుతంగా యాక్ట్ చేసారని, మొత్తంగా అందరూ కలిసి ఎంతో కష్టపడి చేసిన వాల్తేరు వీరయ్య విజయం తనకు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే జోష్ ని అందించిందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు