నా లైఫ్ లో ఇంతటి మార్పులకు కారణం తనే – సూపర్ స్టార్ రజినీకాంత్

Published on Jan 29, 2023 2:12 am IST


కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ కి మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ఎందరో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నుండి సినిమా వస్తుంది అంటే చాలు తమిళ నాడు తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సైతం పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఇక తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు రజినీకాంత్.

ఇక తాజాగా నటుడు వైజి మహేంద్రన్ నటించిన చారుకేశి నాటక ప్రదర్శనకి ప్రత్యేకంగా విచ్చేసిన రజినీకాంత్ మాట్లాడుతూ, నిజానికి తన జీవితంలో ఇంతటి మార్పులకు కారణం తన భార్య లత నే కారణం అని వెల్లడించారు. పెళ్లి కాక ముందు తాను పలు సందర్భాల్లో మద్యం సేవించడం, మాంసం తినడం, ఎక్కువగా పొగత్రాగడం వంటివి చేసేవాడినని, అయితే లత తో పెళ్లి అయిన తరువాత పూర్తిగా తన ఆరోగ్యం పై ఆమె శ్రద్ధ పెట్టి అటువంటి అలవాట్లు అన్ని ఆమె మాన్పించడంతో పాటు ఎన్నో విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిందని అన్నారు. తను ఈ లైఫ్ లో జీవిత భాగస్వామిగా లభించడం తన అదృష్టం అన్నారు రజినీకాంత్.

సంబంధిత సమాచారం :