బాబోయ్ ఆ సబ్జక్ట్ అంటే నాకు ఎంతో భయం – అడివి శేష్

బాబోయ్ ఆ సబ్జక్ట్ అంటే నాకు ఎంతో భయం – అడివి శేష్

Published on Mar 24, 2023 2:30 AM IST

యువ నటుడు అడివిశేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో వరుసగా సక్సెస్ లని అలానే ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గూఢచారి 2 మూవీ చేస్తున్నారు అడివిశేష్. తాజాగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గుడ్‌ స్కూల్‌ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడ్‌ స్కూల్‌ యాప్‌ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్‌ భాస్కర్‌, విద్యారంగానికి సంబంధించిన ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు, ఆంగ్లంలో అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడవి శేష్ అన్నారు. తెలుగ పిల్లలకు కావాల్సిన రితీలో విద్య అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిజానికి తనకు సైన్స్‌ సబ్జక్ట్ అంటే ఎంత ఇష్టమో గణితం అంటే అంత భయమని ఆడవి శేష్ అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో చదవి అంశాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. పరీక్షల సయమంలో తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకోని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

ప్రస్తుతం చేస్తున్న గుఢచారి 2 మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని, దాని తర్వాత హాలీవుడ్‌ తరహా మూవీలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త ఏజ్డ్ టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్‌ అని ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు