క్యాచీ ట్యూన్‌తో లైలా ‘ఇచ్చుకుందాం బేబీ’ సాంగ్

క్యాచీ ట్యూన్‌తో లైలా ‘ఇచ్చుకుందాం బేబీ’ సాంగ్

Published on Jan 23, 2025 4:47 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో ఈ మూవీలో అతడి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా ‘ఇచ్చుకుందాం బేబీ’ అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

హీరోహీరోయిన్ మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ ఆద్యంతం క్యాచీ ట్యూన్‌తో ట్రెండీ లిరిక్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ ఈ పాటను కంపోజ్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో విశ్వక్ సేన్ లుక్స్‌తో పాటు హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాల విందు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. పూర్ణాచారి అందించిన లిరిక్స్ క్యాచీగా ఉండగా ఆదిత్య ఆర్‌కె, ఎంఎం మానసి ఈ పాటను చక్కగా ఆలపించారు.

మొత్తానికి లైలా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘సోను మోడల్’ పూర్తి మాస్ ర్యాప్ తరహాలో కంపోజ్ చేయగా.. ఇప్పుడు ‘ఇచ్చుకుందాం బేబీ’ సాంగ్ మంచి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు