
ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం “ఐస్ క్రీమ్ 2”. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం (21-09-2014) విజయవాడలోని “హాయ్ ల్యాండ్”లో పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, జె.డి.చక్రవర్తి, నవీనా, శాలిని, ధనరాజ్, భూపాల్, సంగీత దర్శకుడు సత్య కశ్యప్, డా కూటికుప్పల సూర్యారావు, హాయ్ ల్యాండ్ మార్కెటింగ్ జి.యం కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ “ఐస్ క్రీమ్ 2” ఆడియోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… “నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. నా దర్శకత్వ పునాది విజయవాడలోనే మొదలైంది” అన్నారు.