డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమైన “ఇచ్చట వాహనములు నిలుపరాదు”

Published on Sep 7, 2021 3:15 pm IST


సుశాంత్ హీరోగా ఎస్. దర్శన్ దర్శకత్వం లో ఇటీవల థియేటర్ల లో విడుదల అయిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నో పార్కింగ్ ప్లేస్ లో వెహికల్స్ పార్క్ చేస్తే ఫైన్ పడుతుంది అని తెలుసు, కానీ ఇలా అవుతుంది అని ఎవరైనా అనుకుంటారా అంటూ ఆహా వీడియో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం సెప్టెంబర్ 17 వ తేదీ నుండి డిజిటల్ ప్రీమియర్ గా విడుదల కానుంది. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటించగా, అభినవ్ గోమతం, నిఖిల్ కైలాస, వెన్నెల కిషోర్, ఐశ్వర్య, ప్రియదర్శి తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :