‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్

‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్

Published on Nov 5, 2022 4:00 PM IST

టాలీవుడ్ యువ నటుడు అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో. అందాల నటి అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్ ఎంతో గ్రాండ్ గా నిర్మించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనికి సమర్పకుడిగా వ్యవహరించారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్, ఫామిలీ, లవ్ ఎంటర్టైనర్ గా తెరెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీకి ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభిస్తుడడంతో రేపు సాయంత్రం అనగా నవంబర్ 6న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనుంది యూనిట్. కాగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీకి తన్వీర్ మీర్ డీవోపీ గా వర్క్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు