“భీమ్లా నాయక్” పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Mar 24, 2022 3:45 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు నటించిన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్”. సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గత నెల రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక సినీ తారల్లో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకుంది.

మరి లేటెస్ట్ గా ఈ సినిమా పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించడం ఆసక్తిగా మారింది. తాజాగా ఈ సినిమా రెండు స్ట్రీమింగ్ యాప్స్ “ఆహా” మరియు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారంకి వచ్చింది. మరి ఆహా స్ట్రీమింగ్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.

తాను కొంచెం లేట్ అయ్యాను కానీ సినిమా సక్సెస్ అయ్యినందుకు పవన్ కళ్యాణ్ మరియు రానా, దర్శకుడు సాగర్ చంద్ర సహా చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెబుతున్నానని తెలిపాడు. అలాగే ఆహా లో భీమ్లా నాయక్ సినిమా డాల్బీ 5.1 లో అందరు ఎంజాయ్ చెయ్యొచ్చని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఐకాన్ స్టార్ షేర్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇద్దరి హీరోల అభిమానుల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :