“పుష్ప 2” ని నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేస్తా – ఐకాన్ స్టార్

Published on Dec 29, 2021 12:20 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. అనేక అంచనాలు అడ్డంకుల నడుమ ఈ చిత్రం ఎలా అయితేనేం ఫైనల్ గా అనుకున్న విధంగా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి ప్రతి భాషలో కూడా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరియు చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ని ఇప్పుడు జరుపుకుంటున్నారు.

అయితే ఈరోజు మేకర్స్ ఒక కీలక సక్సెస్ పార్టీ ని నిర్వహించుకున్నారు. మరి ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని కీలక కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా అన్ని భాషల్లోని సక్సెస్ కోసం మాట్లాడుతూ ఆయా భాషల్లో వస్తున్న ఆదరణ అక్కడ తమ సినిమాని ప్రెజెంట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఐకాన్ స్టార్ థాంక్స్ చెప్పాడు.

అలాగే నార్త్ ఆడియెన్స్ లో తనని తనకు టెస్ట్ చేసుకోడం కోసమే పుష్ప ని హిందీ రిలీజ్ ప్రయత్నం చేశామని కూడా తెలిపాడు. ఇక ఇదే సమయంలో పుష్ప 2 పై మాట్లాడుతూ ఈ సినిమాని మాత్రం వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేస్తానని దాన్ని మాత్రం ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్ చేయనన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సగర్వంగా ఈ ప్రకటనను అందించాడు. సో పుష్ప పార్ట్ 2 ఇక ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :