సోషల్ మీడియాలో బన్నీ క్రేజ్..ఇన్స్టా ఫాలోవర్స్ లో తగ్గేదేలే.!

Published on Jan 28, 2022 8:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు దశాబ్ద కాలం కితమే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో భారీ లెవెల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకొని వార్తల్లోకి ఎక్కాడు. మరి మారుతున్న కాలం తోనే తనదైన సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారి మరింత స్థాయి క్రేజ్ ని సంతరించుకున్నాడు.

మరి జస్ట్ కొన్ని రోజులు కితమే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ 15 మిలియన్ కి చేరి ఫాస్టెస్ట్ 15 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సెట్ చేసిన బన్నీ ఇప్పుడు అదే మాస్ స్పీడ్ లో ఇప్పుడు 16 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ క్రాస్ చేసి మళ్ళీ ఫాస్టెస్ట్ 16 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న సెలెబ్రెటీగా నిలిచాడు.

దీనిని బట్టి బన్నీ క్రేజ్ సోషల్ మీడియాలో ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇది పక్కన పెడితే రీసెంట్ గా తన హిట్ సినిమా “పుష్ప” లో తన సిగ్నేచర్ స్టెప్ కానీ శ్రీవల్లి సాంగ్ గాని ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యి కూర్చున్నాయి.

సంబంధిత సమాచారం :