“ఢీ 13” ఫైనల్స్ కి ఐకాన్ స్టార్ మాసివ్ గ్రాండ్ ఎంట్రీ..!

Published on Nov 27, 2021 4:28 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఎన్నో సూపర్ హిట్ షోలు అందించిన టాప్ మోస్ట్ టెలివిజన్ సంస్థ ఈటీవీ. అయితే అందులో గత దశాబ్దంకి పైగా విజయవంతంగా ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో “ఢీ”. ఈ షో కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ లు మెస్మరైజ్ చేసే డాన్స్ లు యంగ్ టాలెంట్స్ కి కొలువు ఇది.

మరి ఈ గ్రాండ్ షో ఇప్పుడు 13వ సీజన్లో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ రసవత్తరంగా సాగుతూ ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకుంది. ఇక ఫైనల్స్ ఎపిసోడ్ అంటే అందరికీ అడ్రినలిన్ పెరగాల్సిందే.. మరి దాన్ని మరింత పెంచుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

తన లేటెస్ట్ సినిమా పుష్ప మాస్ సాంగ్ తో భారీ సెట్స్ నడుమ మొత్తం 200 మంది డాన్సర్స్ సమక్షంలో అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయింది. దీనితో ఈ మెగా మాసివ్ ఎపిసోడ్ కోసం టెలివిజన్ వీక్షకులు ఇప్పుడు నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ చేతులు మీదుగా ట్రోఫీ ఎవరికి వెళుతుంది? ఎవరిని బన్నీ అనౌన్స్ చేస్తాడు అనేవి ఆసక్తిగా మారిపోయాయి.

ఆల్రెడీ డాన్స్ కి అల్లు అర్జున్ పెట్టింది పేరు ఇది వరకే తాను ఓసారి ఫైనల్స్ కి కూడా వచ్చాడు. ఇది రెండోసారి అందుకే ఈసారి ఇంకా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మాసివ్ ఎపిసోడ్ పై మరింత సమాచారం మీకోసం త్వరలోనే తీసుకువస్తాము.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :