“బింబిసార” కి సాలిడ్ రివ్యూ ఇచ్చిన ఐకాన్ స్టార్..!

“బింబిసార” కి సాలిడ్ రివ్యూ ఇచ్చిన ఐకాన్ స్టార్..!

Published on Aug 7, 2022 1:02 PM IST

మన టాలీవుడ్ లో మంచి సక్సెస్ లు పడినప్పుడు గాని అలాగే కొత్త టాలెంట్ నుంచి కూడా మంచి సినిమాలు పడినప్పుడు గాని ఆ సినిమాలు చూసి వారిని ఎంకరేజ్ చెయ్యడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ముందుంటారు. మరి అలా లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినబడుతున్నటువంటి భారీ సక్సెస్ “బింబిసార” ని అంతా కొనియాడుతుండగా ఈ సినిమాపై ఐకాన్ స్టార్ కూడా తన ఇంట్రెస్టింగ్ రివ్యూ అందించాడు.

మొదటగా బింబిసార యూనిట్ కి పెద్ద కంగ్రాట్స్ చెబుతున్నానని కళ్యాణ్ రామ్ తన ప్రెజెన్స్ తో సినిమాలో అదరగొట్టేసాడని కొత్త టాలెంట్ ని, ఈ తరహా అద్భుత చిత్రాలను ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చినందుకు తన ఎఫర్ట్స్ కి నా హృదయపూర్వక గౌరవ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

అలాగే ఇలాంటి చిత్రాన్ని సూపర్బ్ గా హ్యాండిల్ చేసిన కొత్త దర్శకుడు వశిష్ఠ ని అభినందిస్తున్నానని, అలాగే టెక్నీషియన్స్ ఎం ఎం కీరవాణి ఇతర ఆర్టిస్టులు వర్క్ కి అభినందనలు తెలుపుతున్నానని ఫైనల్ గా బింబిసార అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని ఐకాన్ స్టార్ సాలిడ్ రివ్యూ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు