బాలీవుడ్ అడ్డాలో ఐకాన్ స్టార్ పాగా..ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి.?

Published on Jan 1, 2022 4:41 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మన దగ్గర యూత్ లో కానీ ఫీమేల్ ఫాలోయింగ్ కానీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అలాగే సౌత్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎప్పుడో ఐకాన్ స్టార్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, స్పెషల్ మార్కెట్ ని కూడా ఏర్పర్చుకున్నాడు. అయితే అల్లు అర్జున్ సినిమాలకి విశేష ఆదరణ ఒక్క మన వైపు నుంచి మాత్రమే కాదు అటు నార్త్ ఆడియెన్స్ లో కూడా ఉంది తన హిందీ సినిమాల డబ్బింగ్ వ్యూస్ చెప్పాయి.

అయితే యూట్యూబ్ లో వందలాది మిలియన్ వ్యూస్ చూసినంత మాత్రాన ఆ జనం అంతా థియేటర్స్ కి వచ్చేస్తారా ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన “పుష్ప”తో సాలిడ్ సమాధానం ఇచ్చాడు. అస్సలు ఎలాంటి సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా పైగా కేవలం 50 శాతం అక్యుపెన్సీతోనే లేటెస్ట్ గా ఒక్క హిందీ వెర్షన్ లో 50 కోట్ల మార్క్ ను టచ్ చేసాడు.

ఇది మామూలు విషయం కాదు. అలాగే దీనిని బట్టి బాలీవుడ్ ప్రేక్షకులు బన్నీ సినిమాలు కేవలం ఫోన్ లు టీవీల్లోనే కాదు టికెట్ కొని థియేటర్స్ లో కూడా చూస్తారు అని అంతు లేని రిజల్ట్ ని కూడా అందించారు. దీనితో బన్నీ బాలీవుడ్ స్టార్డం పై ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి.

ఇక తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా ధారాళంగా అల్లు అర్జున్ పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ చేసుకోవచ్చు, అది కూడా ఎలాంటి డౌట్ లేకుండా. ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ 50 కోట్లు పెడితే.. ఇక నార్మల్ గా ఉండి మంచి ప్రమోషన్స్ లో చేస్తే మాత్రం తన సినిమాలు డెఫినెట్ గా బాలీవుడ్ అడ్డాలో పాగా వేస్తాయి. ఇదంతా అల్లు అర్జున్ కి హిందీ ఆడియెన్స్ నుంచి వచ్చిన గొప్ప బహుమతి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :