కొత్త లుక్ తో ఇంకా షేక్ చేస్తూనే ఉన్న బన్నీ !

Published on Jul 25, 2022 5:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన సరికొత్త లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. బన్నీ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. బ్లాక్ టీషర్ట్‌ లో స్ట్రెయిట్ హెయిర్తో బన్నీ చాలా స్టైలిష్‌గా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటో తీశాడట.

ప్రస్తుతానికి అయితే, బన్నీ ఫోటో లైక్స్ అండ్ షేర్స్ తో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక బన్నీ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్ప 2 రాబోతుంది. ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో కూడా ఈ సినిమా పై ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే.. పుష్ప 2 లో సాధ్యమైనంత వరకూ హిందీ నటులను కూడా తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :