ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” క్రేజీ లుక్‌!

Published on Jul 28, 2022 9:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ చిత్రం సక్సెస్ తో దూసుకు పోతున్నాడు. ఈ చిత్రం కి సంబంధించిన రెండో పార్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే బన్నీ ప్రస్తుతం ఒక యాడ్ షూట్ లో ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఈ యాడ్ షూట్ పై ఇప్పటికే సెన్సేషన్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. అతని లుక్ యొక్క స్నీక్ పీక్ ఇప్పుడు బృందం వెల్లడించింది. బన్నీ స్టైలిష్ చెవిపోగులతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాడ్ త్వరలో విడుదల కానుంది. పుష్ప ది రూల్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో ఉండటం తో సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :