‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలే కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Published on May 24, 2023 2:00 am IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటిటి ప్లాట్‌ఫారమ్ లో తెలుగు ఇండియన్ ఐడల్ 2 కొన్నాళ్లుగా ప్రసారం అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ కార్యక్రమం ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది మరియు ఫైనల్‌ ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు.

యాదృచ్ఛికంగా టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకరైన అపారమైన ప్రతిభావంతులైన శృతి నండూరితో తన మొదటి క్రష్ శృతి గురించి అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. అనంతరం గాయని సౌజన్య కుమార్తె మిహిరాతో ఆనందకరమైన క్షణాలు గడిపాడు. ఇక పదివేల మంది పార్టిసిపెంట్లలో టాప్ 5 ఫైనలిస్టులు న్యూజెర్సీ నుండి శృతి, హైదరాబాద్ నుండి జయరామ్, సిద్దిపేట నుండి లాస్య ప్రియ, హైదరాబాద్ నుండి కార్తికేయ మరియు విశాఖపట్నం నుండి సౌజన్య భాగవతుల తమ అసమాన నైపుణ్యాలను మరియు అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్ దగ్గర పడుతుండగా, అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక కిరీటాన్ని ఎవరు గెలుచుకుంటారు అనేది తెలియాలి అంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :