ఒక్కసారిగా “ట్రిపుల్ ఏ” కాంబోపై వేరే లెవెల్ హైప్.!

Published on Jan 25, 2022 11:14 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో చూస్తున్నాము. తన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప” తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్డం పై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు బన్నీ కంప్లీట్ చేసే ఈ పుష్ప సిరీస్ తర్వాత ఎలాంటి సినిమాలు టేకప్ చేస్తాడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరి అందుకు సమాధానంగా ఇప్పుడు ఒక క్రేజీ కాంబో పేరు వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ అలాగే మరో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ట్రయో కోసం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఆల్ మోస్ట్ ఈ కాంబో సెట్టయ్యినట్టే అని స్ప్రెడ్ అవుతున్న టాక్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి.

ఇంకా అట్లీ మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒకడినే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడని అభిమానులు కూడా ఎవరికి నచ్చిన థియరీ లు వారు చెప్పుకుంటున్నారు. ఇలా మొత్తానికి మాత్రం ఈ క్రేజీ “ట్రిపుల్ ఏ” కాంబో పేరు మాత్రం మంచి వైరల్ గా హాట్ టాపిక్ అవుతుంది.

సంబంధిత సమాచారం :