అక్టోబర్ 2న “ఇదే మా కథ”..!

Published on Sep 25, 2021 6:02 pm IST

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జ‌ర్నీ చిత్రం “ఇదే మా క‌థ‌”. గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అయితే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాను గాంధీ జయంతి అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో వారి మధ్య ఎలాంటి పరిచయం ఏర్పడింది? ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? ఆ తర్వాత గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :