హిట్ ఫ్రాంఛైజ్ మూవీస్ కి ఆడియన్స్ మనసులో అటువంటి ముద్ర ఉండాలి – ‘హిట్ – 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి

Published on Nov 29, 2022 3:12 am IST


వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని సమర్పణ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా ప్రస్తుతం తెరకెక్కిన థ్రిల్లింగ్ సస్పెన్స్ యాక్షన్ మూవీ హిట్ 2 ది సెకండ్ కేస్. అడివి శేష్ హీరోగా కేడి అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుండగా శైలేష్ కొలను దీనిని తెరకెక్కించారు. గతంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరుగగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు.

ఇక ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ ఇటీవల చూసిన తనకు ఎంతో నచ్చిందని, ముఖ్యంగా ట్రైలర్ బిగినింగ్ లో ఆఫీసర్ అయిన కేడి ఇటువంటి క్రిమినల్స్ ది కోడి బుర్ర డైలాగ్ చెప్పడం అలానే ఎండింగ్ లో అతను పట్టుకోవాలకుంటున్న క్రిమినల్ కోడి బుర్ర అనే డైలాగ్ ఛాలెంజింగ్ గా రాయడం చూస్తుంటే తప్పకుండా డైరెక్టర్ శైలేష్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోందని అన్నారు. ఇక నిర్మాతలు అయిన నాని, అలానే ప్రశాంతి తిపిర్నేని ఈ హిట్ ఫ్రాంచైజ్ మూవీస్ ని ప్రతి ఏడాది పార్టులుగా తీయడంతో పాటు ఆడియన్స్ మనసులో ఫలానా టైంలో హిట్ సిరీస్ నుండి నెక్స్ట్ సీక్వెల్ వస్తుంది అనేలా నోటెడ్ గా గుర్తుండిపోయేలా ప్రతి ఏడాది ఏదైనా వారం లేదా డేట్ ప్రకారం రిలీజ్ చేస్తే తప్పకుండా ఈ సిరీస్ అన్ని కూడా రాబోయే రోజుల్లో ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకునే ఛాన్స్ ఉందని, అలానే ప్రస్తుతం తెరెక్కిన హిట్ 2 మూవీ టీమ్ కి తన తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు రాజమౌళి. కాగా హిట్ 2 మూవీ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :